డిసెంబర్ ఒకటికి పెండింగు జీతం
 

* నవంబరు నెల జీతంతో పాటు సగం
* సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ అధికారులు చెప్పారు
* బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడి


(ఉద్యోగులు న్యూస్)


కరోనా వల్ల  మార్చి, ఏప్రిల్ నెలలో పెండింగులో ఉంచిన జీతాల్లో సగం డిసెంబర్ ఒకటిన ప్రభుత్వం చెల్లిస్తోందని ఏపీ అమరావతి జేఏసీ  ఛైర్మన్  బొప్పరాజు వెంకటేశ్వర్లు,  ప్రధాన కార్యదర్శి వై వి రావు చెప్పారు. వీరు శుక్రవారం రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణలను కలిసి ఈ విషయాలపై చర్చించామని చెప్పారు. వారి సమాచారం మేరకు నవంబరు జీతంతో పాటు కరోనా పెండింగు జీతాలు సగం చెల్లిస్తామని చెప్పారన్నారు.   ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి ఈ విషయం ప్రస్తావించగా ఆయన ముఖ్యమంత్రి ఇచ్చిన మాట తప్పేది లేదని చెప్పారన అన్నారు. అంతే కాకుండా ఆర్థికశాఖ అధికారులతోను ఫోన్లో మాట్లాడారి కన్ ఫం చేసుకున్నారని బొప్పరాజు , దివాకర్ లు చెప్పారు.  అనంతరం సచివాలయంలో ఆర్థికశాఖ  కార్యదర్శి కె.వి.వి.సత్యానారాయణను కలిసి  పెండింగు జీతాలపై మాట్లాడగా నవంబరు జీతంతో  పాటు సగం పెండింగు జీతం ఇస్తున్నట్లు చెప్పారని బొప్పరాజు వెల్లడించారు. మిగిలిన 50శాతం జీతం డిసెంబర్ నెలతో పాటు ఇవ్వాలని ఆర్థికశాఖ కార్యదర్శిని కోరగా ఆయన అంగీకరించారన్నారు.