Thursday 25th February 2021

ఉద్యోగుల సమస్యలపై త్వరలో సమావేశం

* ప్రభుత్వ ఉద్యోగులు సంఘానికి ముఖ్యమంత్రి హామీ

* రెండు మూడు రోజుల్లో  చర్యలు
* ధనుంజయ్ రెడ్డికి జగన్  నిర్దేశం

ఉద్యోగులు న్యూస్

ఆంధ్రప్రదేశ్  లో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు.   ఇందుకోసం రెండు మూడు రోజుల్లో చర్యలు చేపట్టాలని తన కార్యాలయ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డికి సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు  కె.ఆర్ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి   ఆస్కార్ రావు తదితరులు సోమవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జగన్ ను కలిశారు. సంఘం నూతన డైరీని, క్యాలెండర్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా 20 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమస్యలను వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయా సంఘాలకు సంబంధించిన ప్రతినిధుల ద్వారా ముఖ్యమంత్రికి వినతి పత్రాలు ఇప్పించారు. దీంతో సీఎం జగన్ స్పందించారు. త్వరలోనే సమావేశం ఏర్పాటు కు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం  అసోసియేట్ అధ్యక్షులు సి.హెచ్. రవీంద్రబాబు కోశాధికారి ఆర్ లక్ష్మణ, కార్యదర్శి డి.  శ్రీకాంత్ రాజు, కార్యనిర్వాహక కార్యదర్శి జి. నాగసాయి,  రెవిన్యూ జె.ఎ.సి. చైర్మన్ వి.యస్ దివాకర్, ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అధ్యక్షులు యస్. శ్రీనివాస్ రావు,  ఎక్సైజ్ కానిస్టేబుల్స్ సంఘ అధ్యక్షులు ఎమ్. కోటయ్య వి.ఆర్. ఓ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఆంజనేయకుమార్, కార్యదర్శి సి. హెచ్.  సురేష్ బాబు, జూనియర్ లెక్చరర్స్ డైరెక్ట్  రిక్రూటింగ్ సంఘ కార్యదర్శి కె. సుధాకర్, లైబ్రేరియన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె. సంజీవరావు, ఎ.పి. కమర్షియల్  టాక్స్ ఉద్యోగ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఎమ్. రమేష్ కుమార్ తదితరులు ముఖ్యమంత్రిని  కలిసిన వారిలో ఉన్నారు.