Thursday 29th July 2021

సీఎం చెప్పిన ఉత్తర్వు అమలులో జాప్యం

-రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆవేదన

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జులై 15

సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ  కొన్ని ఉత్తర్వులు ఇవ్వడంలో ప్రభుత్వ అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారో  అర్థం కావడం లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆవేదన వ్యక్తపరిచారు. సాధారణంగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు అమలు చేసే బాధ్యత అధికారులేదని కానీ కొన్ని విషయాల్లో  వెంటనే ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. జేఏసీ చైర్మన్ ఏపీ ఎన్జీవో సంఘ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ ఎన్ చంద్రశేఖర్ రెడ్డి పదవీ విరమణ సభ తాడేపల్లి లోని టి ఎస్ ఆర్ కళ్యాణమండపం లో లో గురు వారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు అన్ని ముఖ్యమంత్రి దృష్టిలో ఉన్నాయని త్వరలో వీటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఏపీ ఎన్జీవో సంఘం 70 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం అని పేర్కొంటూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం లో ఎన్జీవో సంఘం చొరవ ను అభినందించారు .ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నారని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి సీఎం  ప్రకటిస్తున్న పథకాలు అమలులో ఉద్యోగుల పాత్ర అనిర్వచనీయం అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో చెప్పిన హామీలన్నీ పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని ముఖ్యంగా సిపిఎస్ సమస్య కూడా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
చంద్రశేఖర్ రెడ్డి కి సముచిత స్థానం ఏపీఎన్జీవో సంఘ అధ్యక్షులుగా పనిచేసిన చంద్రశేఖర్ రెడ్డి కి తమ ప్రభుత్వం సముచిత స్థానం గౌరవిస్తుందని ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డి సభలో ప్రకటించారు. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వారధిగా ఉండి సమస్యల పరిష్కారానికి ఆయన చర్యలు చేపడతారన్నారు.  ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి ని ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డి  దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్ష కార్యదర్శులు బండి శ్రీనివాసరావు శివారెడ్డి తదితరులు గజమాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జేఏసీ సెక్రటరీ హృదయ రాజు ఎన్జీవో సంఘ సహ అధ్యక్షులు పురుషోత్తమ నాయుడు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫ్యాప్టో చైర్మన్ జోసెఫ్ సుధీర్ బాబు 
వ్యవసాయ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు ఎం డి ఇక్బాల్ 13 జిల్లాల అధ్యక్ష కార్యదర్సులు పాల్గొన్నారు.