జగనన్న మాటే శాసనం కావాలి
 

•    కాంట్రాక్టు పారామెడికల్ సిబ్బందిని క్రమబద్ధీకరించి మాట నిలబెట్టుకోవాలి

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 14 :   ఇరవై సంవత్సరాలగా కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న డీఎస్సీ కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ సాధనకు కడపజిల్లా, రాయచోటి శాసనసభ నియోజకవర్గం పరిధిలోని సంబేపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన చేశారు.  ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, తమను వెంటనే క్రమబద్ధీకరించాలని ఉద్యోగులు నినాదాలు చేశారు. ఉద్యోగులను ఉద్దేశించి వైద్యాధికారి డాక్టర్ ఎ.సూర్యనారాయణరెడ్డి మాట్లాడారు.  జేఏసీ రాష్ట్ర కన్వీనర్ యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ జగనన్న మాటే శాసనం కావాలని, డీఎస్సీ కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనాతో కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలకు కూడా రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని,వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రెగ్యులర్ కాకుండానే ఉద్యోగ విరమణ చేసిన వారికి, ఒక్కరూపాయి కూడా ఆర్థికపరమైన ప్రయోజనం ఇవ్వాలేదని,వారికి రూ. 20 లక్షల చొప్పున  ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ విధానంలో మగ్గుతూ ఒకే చోట ఉద్యోగం చేస్తున్న వారి బదిలీల కోసం మార్గదర్శకాలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు 
 ఈకార్యక్రమంలో  డాక్టర్ ఎం.భగవధ్గీత, జేఏసీ జిల్లా కన్వీనర్ బి.రవిశంకర్, జిల్లా నాయకులు యం.సుదర్శనరాజు, జి.ఇ.యస్.రాణి, హెల్త్ సూపర్వైజర్లు కె.సదాశివారెడ్డి,కె.క్రిష్ణవేణి,  స్టాప్ నర్సులు కె.కవిత,.రాజేశ్వరి, వి.గీత, ల్యాబ్ టెక్నీషియన్ ఎం.విజయలక్ష్మి, ఏయన్ యం  కె.మెహరున్బీ,వి.నగేష్, ఆరోగ్య మిత్ర పి.చెన్నక్రిష్ణ, ఆశా కార్యకర్తలు కె.శిల్పసుధ,యస్.కె.మస్తానీ తదితరులు పాల్గొన్నారు.