Saturday 19th June 2021

రాలిపోతున్న కాంట్రాక్టు ఉద్యోగులు

-ప్రభుత్వం తక్షణమే స్పందించాలి

-రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం రెండోరోజు నిరసన కార్యక్రమాలు

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

జూన్ - 01
 

రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం రెండోరోజు వైద్య ఆరోగ్య శాఖ లోని కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు మరింత ఊపందుకున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆంధ్రప్రదేశ్ డి.ఎస్.సి కాంట్రాక్టు పారామెడికల్  ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (జె.ఏ.సి) రాష్ట్ర కన్వీనర్ జి.వి.వి.ప్రసాద్ మంగళవారం సాయంత్రం  విలేకరులకు వివరించారు.

రెగ్యులర్ చేసి తీరుతామన్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మాట నెరవేరక ముందే కాంట్రాక్టు ఉద్యోగులు పిట్టల్లా రాలిపోతున్నారని, కరోనా సేవల్లో కోవిడ్ సోకి కొందరు..కాంట్రాక్టు లో ఉన్న తాము ఛస్తే తమ కుటుంబానికి భరోసా ఏంటని మానసికంగా బాధపడుతూ  ఇంకొందరు.... ఇలా ఎందరో ప్రాణత్యాగాలు చేస్తున్నా కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి కనికరమే లేకుండా పోతోందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.

అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసి తీరుతామని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట నెరేవేరే లోపే ఎందరో కాంట్రాక్టు ఉద్యోగులు ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం కు చెందిన ఇరగవరం పి.హెచ్.సి లో కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వీరవల్లి శ్రీధర్ కుమార్ రోడ్డు ప్రమాదంలో గురై సోమవారం దుర్మరణం పలుకావడం తమను తీవ్రంగా కలచివేసిందన్నారు.

గత నెలలో కోవిడ్ తో  తూర్పు, పశ్చిమ గోదావరిజిల్లాల్లో ముగ్గురుఅంతకుముందు  తూర్పుగోదావరి జిల్లాలో ప్రమాదాలకు గురై ఒకే వారంలో ఇద్దరు, అంతక్రితం  ప్రకాశం జిల్లాలో కొద్ది కాలంలోనే ఇద్దరు ఇలా గడిచిన ఏడాది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్లు ఎందరో వరుస మరణాలకు గురయ్యారని అన్నారు.

తాము చనిపోతే తమపై ఆధారపడిన కుటుంబం మొత్తం దిక్కూమొక్కు లేకుండా అనాధలుగా రోడ్డున పడుతోందని, జీఓ 25 అమలుకు నోచుకోకపోవడంతో కనీసం పైసా కూడా ఇన్స్యూరెన్స్ కూడా అందని దుర్భర పరిస్థితి తమదన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి అన్ని అర్హతలు ఉన్నా వైద్య ఆరోగ్య శాఖ లోని కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని, ఇదే నినాదంతో కాంట్రాక్టు ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్నారని, తమ రెగ్యులర్ సమస్య తేలేవరకూ ఉద్యమం కొనసాగుతుందని జి.వి.వి.ప్రసాద్  వెల్లడించారు.

జగనన్న ... కరుణించన్న ...

 కడప జిల్లా రాయచోటి మండలం యండపల్లె ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని, మాధవరం ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలోని కురవపల్లె లో కరోనా వాక్సిన్ కార్యక్రమంలో ఏపీ డియస్సి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల జెఏసి ఆధ్వర్యంలో జగనన్న కరుణించన్న, కాంట్రాక్టు పారామేడికల్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని, కరోనాతో మరణించిన కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల కుటుంభాలను ఆదుకోవాలని, వారి కుటుంబంలకు 30 లక్షల రూపాయలు ఎక్సిగ్రేషియో చెల్లించాలని, వారి కుటుంబంలో ఒక్కరికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం ఇవ్వాలని, నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జెఏసి రాష్ట్ర కన్వీనర్ యర్రపురెడ్డి విశ్వనాథ రెడ్డి,మహిళ  హెల్త్ సూపర్వైజర్  జి.రవణమ్మ, యంయల్ హెచ్ పి  మద్దిరాల.జ్యోతి, ఆర్. జయసుధ, ఏ.శారదా ,104 సిబ్బంది బి.మోహన్ వంశీరెడ్డి, షేక్ కిరణ్ భాష ,ఆశా కార్యకర్త బి.గంగాదేవి తదితరులు పాల్గొన్నారు.

ఎక్కువ మందిచదివినవి