Thursday 24th June 2021

కాంట్రాక్టు ఉద్యోగుల ఉద్యమం ఉదృతం
 

అన్ని చోట్లా ప్రతిజ్ఞలు

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

జూన్ 2 - వైద్య ఆరోగ్య శాఖ లోని కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులు బుధవారం అన్ని జిల్లాల్లోను,మండలాల్లోను  ప్రతిజ్ఞ చేసి తమ నిరసన మూడో రోజు కొనసాగించారు. తమను రెగ్యులర్ చేయాలని వారు కోరుతూ ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే.చనిపోతున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి నయాపైసా ఆర్థిక సాయం కూడా అందకపోవడంతో వారిపై ఆధారపడిన కుటుంబాలన్నీ హఠాత్తుగా రోడ్డునపడి అనాధలైపోతున్నారని జేఏసీ కన్వీనర్ ప్రసాద్ పేర్కొన్నారు.

రాయచోటిలో...

రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఉన్న  వైయస్ రాజశేఖర రెడ్డి  విగ్రహానికి కాంట్రాక్టు ఉద్యోగులు వినతిపత్రం సమర్పించారు. చనిపోయిన కాంట్రాక్టు ఉద్యోగులకు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఏపీ కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగుల జెఏసి రాష్ట్ర కన్వీనర్ యర్రపురెడ్డి విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు 30 లక్షల రూపాయలు ఎక్సిగ్రేషియో, కుటుంబలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా జేఏసీ కన్వీనర్ యస్.ఖాదర్ బాషా,నాయకులు జి.రామచంద్ర రెడ్డి, యస్.కలందర్, యస్.ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.