కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు
త్వరలోనే పోరాట కార్యాచరణ

- ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత ఆస్కార్ రావు వెల్లడి
- రెగ్యులర్ ఉద్యోగులూ ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలి

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 10- ఆంధ్రప్రదేశ్ లో  డీఎస్సీ కాంట్రాక్టు  పారా మెడికల్ ఉద్యోగుల  క్రమబద్ధీకరణకు త్వరలోనే  పోరాట కార్యక్రమాన్ని ప్రకటిస్తామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి  ఆస్కార్ రావు పేర్కొన్నారు.  తమ సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ మొదటి నుంచి ఈ విషయంలో మద్దతు ఇస్తున్నారని, త్వరలోనే తమ సంఘం రాష్ర్ట కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని ఆస్కార్ రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గత 11 రోజులుగా ఈ కాంట్రాక్టు ఉద్యోగులు తమ విధి నిర్వహిస్తూనే ఆందోళన చేస్తున్నారని ఆస్కార్ రావు పేర్కొన్నారు. వారి పోరాటం న్యాయబద్ధమైనదని, వారి పోరాటాన్ని అర్థం చేసుకోవలసి ఉందని అన్నారు. ఇప్పటికే 20 ఏళ్లుగా వారు కాంట్రాక్టు ఉద్యోగులుగా  ఉన్నారని పేర్కొన్నారు. వారి క్రమబద్ధీకరణ విషయంలో ఇక తాత్సారం చేయడం సరికాదన్నారు. రెగ్యులర్ ఉద్యోగులు కూడా ఎక్కడికి అక్కడ కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగుల పోరాటానికి మద్దతు ఇవ్వాల్సి ఉందని ఆస్కార్ రావు పిలుపునిచ్చారు.

ఎక్కువ మందిచదివినవి