Thursday 24th June 2021

పశ్చిమగోదావరి కలెక్టర్ కు
కాంట్రాక్టు ఉద్యోగుల వినతిపత్రం

- రెగ్యులరైజేషన్ కు చర్యలు తీసుకోవాలని డిమాండ్

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

జూన్ 10-  కాంట్రాక్టు  ఉద్యోగుల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు ఏపీ డీఎస్సీ పారా మెడికల్ కాంట్రాక్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. జేఏసీ నాయకులు బట్టు విజయబాబు నేతృత్వం వహించారు. జిల్లాలో 20 ఏళ్లుగా పారా మెడికల్ సిబ్బంది వివిధ పోస్టుల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తూ  నేటికీ ఉద్యోగ భద్రత లేకుండా ఉన్నారని పేర్కొన్నారు. డీఎస్సీలో ఎంపికై, ఖాళీగా ఉన్న పోస్టుల్లో , రోస్టర్ ప్రకారం నియమితులైనా తాము రెగ్యులర్ కాలేకపోయామని కార్తికేయ మిశ్రాకు వారు ఆవేదన తెలియజేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఎక్స్ గ్రేషియా జీవో 25ని అమలు చేయాలని, కరోనా తో మరణించిన వారి కుటుంబంలో కారుణ్య నియామకం కింద ఉద్యోగ అవకాశం కల్పించాలని, పరస్పర అంగీకార బదిలీలకు అనుమతి ఇవ్వాలని వారు విన్నవించారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులకు తె లియజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ నాయకులు బి.గోవిందరాజు, చంద్రశేఖర్, వై.శ్రీను మీసాల మురళి, గురునాథం, వి.వి.శ్రీనివాస్, అరుణ, రేణుక, దేవి తదితరులు పాల్గొన్నారు.