కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త

- 2015 రివైజ్డు స్కేలు  ఆధారంగా మినిమం టైం స్కేలు
- 180 రోజుల మెటర్నిటీ లీవు
- రూ. 5 లక్షల   ఎక్సుగ్రేషియా

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 18 - ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త . రాష్ర్టంలోని కాంట్రాక్టు ఉద్యోగులందరికీ , అన్ని ప్రభుత్వశాఖల్లో పని చేస్తున్న వారికి 2015 సవరించిన పే స్కేళ్ల  ఆధారంగా మినిమం టైం స్కేలు ఇవ్వాలని ప్రభుత్వం శుక్రవారం రాత్రి  ఉత్తర్వులు  ఇచ్చింది.
మహిళా కాంట్రాక్టు ఉద్యోగులకు 180 రోజుల మెటర్నిటీ లీవు సౌకర్యం కల్పించింది.
ప్రమాదవశాత్తూ, ఇతరత్రా ఇబ్బందుల వల్ల మరణిస్తే రూ. 5 లక్షల పరిహారం ప్రకటించింది. సాధారణమరణం అయితే రూ. 2 లక్షల పరిహారం ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ ఉత్తర్వులు ఇచ్చారు.