ఉద్యోగులకు శుభవార్త
కరోనా ప్రత్యేక  సెలవు మంజూరు

ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం
( ఉద్యోగులు. న్యూస్) ( ఉద్యోగులు.  కామ్)

జూలై5 -  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కరోనా ప్రత్యేక సాధారణ సెలవు  మంజూరు ఫైలుపై ముఖ్యమంత్రి జగన్ సంతకం చేశారు. ఒకటి రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన తరహాలోనే   రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుందని సమాచారం. కేంద్రం నిర్ణయం మేరకే   ఆంధ్ర ప్రదేశ్  లోనూ నిర్ణయం ఉంటుందని ఉద్యోగులు. న్యూస్  ఇంతకుముందే విశ్లేషించింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ అదే తరహాలో  నిర్ణయం తీసుకున్నారు.
కరోనా పాజిటివ్ ఉద్యోగులకు 15 రోజులు ప్రత్యేక సాధారణ సెలవులు, 5 రోజులు కమ్యూటెడ్ సెలవులు మొత్తం 20 రోజుల సెలవులు మంజూరు   చేసేలా నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత ఫైలుపై సీఎం సంతకం చేశారు.
రెగ్యులర్, కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఎవరికి కరోనా వచ్చినా 20 రోజుల సెలవులు మజూరు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు యధాతథంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు.