అక్టోబర్ 2న విజయవాడ లో  రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగుల సత్యాగ్రహదీక్ష

 (ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 15 :   అక్టోబర్ 2వ తేదీన ఏ‌పి‌సి‌పి‌ఎస్  ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ లో రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగుల తో సత్యాగ్రహదీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి సి. ఎం. దాస్, మొండి రవికుమార్ తెలియచేశారు. 2021, సెప్టెంబర్ 1 న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సీపీఎస్ రద్దుచేయాలని నిరసన ర్యాలీలు, బహిరంగ సభలను నిర్వహించినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరవైన నేపథ్యంలో సత్యాగ్రహ దీక్ష చేయనున్నట్లు వెల్లడించారు.