Wednesday 19th May 2021

డి‌ఏ మంజూరు ఉత్తర్వులు విడుదల

*జులై 2018 కరవు భత్యం 3,144శాతం అమలు.

జనవరి జీతంతో పాటు అందేలా  

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక డీఏ ఇస్తూ జీవో ఇచ్చింది. రాష్ట్ర ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి  ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. 2018 జులై నుంచి ఇవ్వాల్సిన కరవు భత్యం 3.144 శాతం ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందే ప్రకటించినట్లు 2021 జనవరి జీతంతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు దీన్ని నగదు రూపంలో అందుకునేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. 2018 జులై ఒకటి నుంచి అంతకుముందు ఉన్న 27.248శాతం కరవు భత్యాన్ని 30, 392 శాతానికి పెంచారు. 2018 జులై ఒకటి 31 డిసెంబర్ 2020 వరకు ఉన్న అరియర్స్ కూడా జీపీఎఫ్ ఖాతాలకు జమ చేస్తారు. మూడు విడతలుగా వాటిని జనవరి 2021 నుంచి జీపీఎఫ్ ఖాతాలకు జమ చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2018 జులై ఒకటి నుంచి 2021 జనవరి మధ్య పదవీ విరమణ చేసిన వారికి అరియర్స్ నగదు రూపంలోనే ఇవ్వనున్నారు. 1.4.2014 తర్వాత ఉద్యోగంలో చేరి ప్రస్తుతం సీపీఎస్ లో ఉన్న వారికి అరియర్స్ మొత్తం మూడు విడతలుగా నగదు రూపంలోనే అందిస్తారు. వారి అరియర్ లో 10శాతం మొత్తం ప్రాన్ అకౌంట్ కు జమ చేస్తారు. జీవో 250 పకారం ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన మొత్తంతో కూడా కలిపి దీన్ని ప్రాన్ ఖాతాకు బదిలీ చేస్తారు ఈ ఉత్తర్వుల కన్నా ముందే ఎవరైనా మరణించి ఉంటే ఆరియర్స్ వారి లీగల్ హైర్ కు అందుతుంది

ఎక్కువ మందిచదివినవి