త్వరలోనే సచివాలయ ఉద్యోగుల రెగ్యులర్
 

- అవాస్తవాలు నమ్మకండి
-  సంఘం నేత షేక్ అబ్దుల్ రజాక్

  (ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
 అక్టోబరు 4 - రాష్ర్టంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెగ్యులర్ చేయనున్నారని, ఈ విషయంలో ఎలాంటి అవాస్తవాలు నమ్మవద్దని  ఆ ఉద్యోగుల సంఘం (361/2020 ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్ తెలిపారు.  రాష్ట్రం లోని గ్రామ/వార్డు సచివాలయల్లో పని చేస్తున్న సుమారు 1,20,000 మంది ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ విషయంపై సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలను నమ్మవద్దని కోరారు.
ప్రొబెషనరీ ఖరారు చేసేందుకు వారాంతపు నివేదికలు ఇవ్వాలని సెప్టెంబర్ 3న ప్రభుత్వం మెమో జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే సచివాలయ ఉద్యోగుల్లో ఆరు రకాల వారికి ప్రొబెషనరీ ఖరారుకు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందేనని అన్నారు.