జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయండి
 

•     ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి కోరిన జేఏసీల నేతలు
 (ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్) 

అక్టోబరు 12:   సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ నేతలు  కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించాయి. వెంటనే  పీఆర్సీ అమలు, డీఏ బకాయిలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఔట్ సోర్సింగ్ వేతనాల పెంపు అంశాలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ తరపున ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, అమరావతి జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగుల సమస్యలను వివరించారు. ఉద్యోగుల సమస్యలపై త్వరలోనే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజ్ఞాపన పత్రం  అందజేశారు. తక్షణమే ఈ డిమాండ్లను ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకువెళ్లి, సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి వీలయినంత త్వరగా పరిష్కరిస్తామని సమీర్ శర్మ వారికి హామీ ఇచ్చారు.