ఈ జేఏసీల హడావుడి నమ్మవద్దు

- ఎన్ జీ వో నేతలు, అమరావతి నేతలే వెళ్లారు
- సీఎం కార్యాలయం పిలుపు కాదు
- తన అనుచరులకు కే.ఆర్.సూర్యనారాయణ వర్తమానం

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
అక్టోబరు 13-  ఏపీ ఎన్ జీ వో జేఏసీ, అమరావతి జేఏసీ చేసే హడావుడిని నమ్మవద్దని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణ ఉద్యోగులకు సూచించారు. ఇది కేవలం రొటీన్ సమావేశం మాత్రమే అని పేర్కొన్నారు.  ‘‘సామాజిక మాధ్యమాల లో ప్రచారం జరుగుతున్నట్లు గా ముఖ్యమంత్రి కార్యాలయం లో ఉద్యోగ సంఘాల తో ఎటువంటి అధికారిక సమావేశం ఏర్పాటు చేయలేదు. కేవలం కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులు రొటీన్ గానే ప్రభుత్వ సలహాదారు  సజ్జల రామకృష్ణ రెడ్డి తో  మాట్లాడడానికి వెళ్లారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి తో మాట్లాడతారు. వారి డిమాండ్లు వినిపిస్తారు. అంతకుమించి  ఈ రోజు ఏమీ జరగదు.’’ ఈ జేఏసీలు, సామాజిక మాధ్యమాలు చేసే హడావుడిని నమ్మకండి  అంటూ కే.ఆర్. పోస్టు పెట్టారు. ఇటీవల ఆ రెండు జేఏసీల విలేకరుల సమావేశంలో  అసలు విషయం బయటపడిందని, ఇదంతా పరువు కోసం పాకులాట మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.