ఇక ఉద్యోగులకు రెగ్యులర్ ఆఫీసు వేళలే!

-కర్ఫ్యూ వేళల సడలింపుతో ప్రభుత్వం నిర్ణయం
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 18 -ఆంధ్రప్రదేశ్ లో జూన్ 21 నుంచి ప్రభుత్వ కార్యాలయాలు యథాతథంగా పని చేస్తాయి.  ప్రస్తుతం కర్ఫ్యూ కారణంగా మారిన వేళలు కాకుండా రెగ్యులర్ వేళల్లోనే కార్యాలయాలు తెరుచుకుంటాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జూన్ 21 నుంచి కర్ఫ్యూ సాయంత్రం 6 గంటల వరకు సడలించాలని నిర్ణయించారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లా మినహా మిగిలిన అన్ని చోట్లా కర్ఫ్యూ సడలిస్తారు. దీంతో  ప్రభుత్వ ఉద్యోగులు కూడా కార్యాలయాలకు ఇక వారి పాత సమయాల్లోనే హాజరు కావలసి ఉంటుంది. ఈ మేరకు ఉత్తర్వులూ వెలువడనున్నాయి.