గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి సర్వీస్ రిజిస్టర్లు 
 

* కారుణ్య నియామకాలకు కమిటీ

* 4 శాఖల విలీనం

* అజయ్ జైన్ తో మీటింగ్ మినిట్స్ విడుదల

రాష్ట్రం లోని గ్రామ వార్డు సచివాలయం లో పనిచేస్తున్న సిబ్బందికి మార్చి 31   లేదా అంత కన్నా ముందుగా సంబంధిత శాఖల కార్యాలయలలో సర్వీస్ రిజిస్టర్ లు తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి  అజయ్ జైన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు చర్యలు  తీసుకోవాలని నిర్ణయించారు.ఈ సమావేశం మినిట్స్ ఈరోజు విడుదలయ్యాయి.

అలాగే రెవిన్యూ  పౌరసరఫరాలు మున్సిపల్ పంచాయతీ రాజ్ శాఖలను విలీనం చేయాలని కమిటీ సూచించింది .2019  అక్టోబర్ నుండి సచివాలయ సిబ్బంది  పని చేస్తున్నారని వారికి ఈ ఏడాది అక్టోబర్ తో రెండు సంవత్సరాలు పూర్తి అవుతాయని సంబంధిత విభాగాలు సూచించిన షరతులకు లోబడి తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. అదేవిధంగా సచివాలయ సిబ్బంది మరణించినచో వారి స్థానంలో  కారుణ్య నియామకాలు హెల్త్ కార్డ్ మంజూరుకు సంబంధిత శాఖ లు చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది .సచివాలయ సిబ్బందికి సంబంధించిన వివిధ శాఖల వారు వారికి సాధారణ సెలవు కాకుండా ఇతర సెలవులు కూడా ఏ విధంగా మంజూరు చేయాలో తగిన సూచనలు ఇవ్వాలని అలాగే వీరికి కంప్యూటర్లు కమ్యూనికేషన్ నైపుణ్యాభివృద్ధి ఫండమెంటల్ రూల్స్ సబార్డినేట్ సర్వీసు రూల్స్ తదితర విభాగాల్లో పరీక్షలు నిర్వహించి సంబంధిత శాఖలకు తెలియపరచాలనీ నిర్ణయించింది.

అన్ని విభాగాల శాఖాధిపతుల గ్రామ  వార్డు సచివాలయంలో మొత్తం మంజూరు చేసిన పోస్టులు ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు రాజీనామా చేసిన సిబ్బంది మిగిలిన ఖాళీలను వెంటనే తెలియజేయాలని సమావేశం సూచించింది . సిబ్బందికి వర్చువల్ తరహాలో శిక్షణ ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్థ జైన్ మున్సిపల్ శాఖ డైరెక్టర్ ఎం ఎం నాయక్ సచివాలయ సిబ్బంది డైరెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ అమరేంద్ర వ్యవసాయ  ఉద్యాన ,వైద్య  ,సాంఘిక సంక్షేమ, పంచాయతీ రాజ్ తదితర శాఖలకు సంబంధించిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఎక్కువ మందిచదివినవి