మార్చి 10 న ఆంధ్రప్రదేశ్ లో స్థానిక కార్యాలయాలకు సెలవు
(ఉద్యోగులు న్యూస్)
మార్చి 10 తేదీన మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపల్ కార్పోరేషన్లు, 75 మున్సిపాలిటీలు నగరపంచాయితీల పరిధిలో స్థానిక సెలవు ప్రకటించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
పోలింగ్ జరగనున్న 10 తేదీన, కౌంటింగ్ జరగనున్న14 తారీకున ప్రభుత్వ భవనాలు, పాఠశాల భవనాలను వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా ఆయా రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటించాలని తెలియజేశారు.