Wednesday 21st April 2021

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి మార్చి 31 లోపు సర్వీసు రిజిష్టర్లు ప్రారంభించాలి
 

* ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఆదేశాలు...


(ఉద్యోగులు.న్యూస్), (ఉద్యోగులు. కామ్)
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి సంబంధించిన సర్వీసు రిజిష్టర్లు మార్చి 31 లోగా ప్రారంభించాలని ఆశాఖ ముఖ్య కార్యదర్శి ఆజయ్ జైన్ ఆదేశించారు.ఈ మేరకు మంగళవారం ఉత్తర్వలు ఇచ్చారు. ఆయా శాఖల విభాగాధిపతులు ఇందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ర్టంలో 1.34 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబెషన్ ప్రకటించాల్సి ఉందన్నారు. తాము పంపిన నమూనా లో సర్వీసు రిజిష్టరు ప్రారంభించి వారం వారం పురోగతి తెలియజేయాలని సూచించారు.