ఉద్యోగుల సమస్యలపై రాజకీయ పార్టీల వైఖరి తేల్చాలి
 

* తెలంగాణ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్

(ఉద్యోగులు.న్యూస్), (ఉద్యోగులు.కామ్)
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగ ,ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని తెలంగాణ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఆ యూనియన్ సమావేశమై ఈ మేరకు తమ డిమాండ్లను రాజకీయ పార్టీల ముందుంచుతూ ఆయా సమస్యలను కూడా ప్రస్తావించింది. లాబీయింగ్ నే నమ్ముకుని తాము ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామనే సంఘాలు ఉద్యమ సంఘాలను విమర్శలు చేయడం తగదని హితవు పలికింది. ఈ కింది అంశాలపై వైఖరి తెలపాలని కోరింది.

- 45 శాతం పి ఆర్ సి ఫిట్మెంట్ ఇస్తూ 01-07-2018  అమలు చేసి బకాయిలు చెల్లించాలి
-  సి పి ఎస్ రాష్ట్ర పరిధి లోని అంశం కాబట్టి వెంటనే దాన్నిరద్దు చేయాలి.
- ఆంధ్ర ప్రదేశ్ లో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెంటనే సొంత రాష్ర్టానికి బేషరతుగా తీసుకు రావాలి.
-  ఉపాధ్యాయుల యూనిఫైడ్ సర్వీసెస్ ఆమోదించి అమలు చేయాలి.
-ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్ల ఇవ్వాలి.
- సుప్రీం కోర్టు ఉత్తర్వులు ప్రకారం  కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. 
- 70 సంవత్సరాల వయసు నిండిన రిటైర్డ్ ఉద్యోగులకు 15 శాతం క్వాంటం పెన్షన్ ఇవ్వాలి.
- ఉద్యోగ, ఉపాధ్యాయులను వేరు చేసే దుర్మార్గమైన ఆలోచనను విరమించుకోవాలి
- ఉద్యోగ ఉపాధ్యాయులకు పదవీ విరమణ వయసును 61సంవత్సరాలకు పెంచాలి.
ఈ సమావేశంలో తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు  చిల గాని సంపత్ కుమార్ స్వామి , ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి పురుషోత్తం , మహిళా అధ్యక్షురాలు  జి.నిర్మల , ఆనంద్ యాదవ్ , భరత్ సత్యనారాయణ, శైఫా బేగం ,,  బొడ్డు ప్రసాద్ , బోగ శ్రీనివాస్, జయలక్ష్మి, రాజేశ్వరి,  డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ గోపాలరావు, సంజీవ్, ఖాద్రీ, జ్యోతి రావు, తో పాటు 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర నాయకులు, జిల్లా బాధ్యులు పాల్గొన్నారు.

ఎక్కువ మందిచదివినవి