Wednesday 21st April 2021

ఉద్యోగుల సంక్షేమ నిధికి రూ 4 కోట్లు

ఉద్యోగులు  న్యూస్

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల సంక్షేమ నిధికి రూ.4 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర అర్థికశాఖ అధికారులు రెండు ఉత్తర్వులు విడుదల చేశారు. ఉద్యోగుల సంక్షేమ నిధి కార్పస్ ఫండ్ వడ్డీ కింద రూ.2 కోట్లు సంబంధిత ఖాతాకు జమ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మరో వైపు ఆ వడ్డీతో సమానంగా ప్రభుత్వ వాటా మొత్తంగా మరో రూ.2 కోట్లు జమ చేశారు. ఉద్యోగుల అత్యవసరాల కోసం ఈ నిధి నుంచి సభ్యులు రుణాలు తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుత బడ్జెట్ లో ఇందుకోసం రూ.8,90 కోట్లు కేటాయింపులు చూపారు. ఇప్పుడు అందుకు తగ్గట్టుగా నిధులు సర్దుబాటు చేశారు. ఉద్యోగుల సంక్షేమ నిధి రాష్ట్ర స్థాయి కమిటీ తమ విధివిధానాల ప్రకారం సభ్యులకు ఈ రుణాలు మంజూరు చేస్తూ ఉంటుంది.