కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తాం..

*సీఎం ముఖ్య కార్యదర్శి ధనంజయ రెడ్డి .

(ఉద్యోగులు న్యూస్)

రాష్ట్రంలో కాంటాక్ట్ పారా మెడికల్ ఉద్యోగులను తప్పనిసరిగా రెగ్యులర్ చేస్తామని ఈ ప్రక్రియ మొదలైందని ముఖ్య మంత్రి ముఖ్య కార్యదర్శి ధనంజయ రెడ్డి వెల్లడించారు. కడప జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లె సంక్రాంతి సందర్భంగా వచ్చిన ఆయనను ఏపీ డీఎస్సీ కాంట్రాక్ట్ పారామెడికల్ ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ యర్రపు  విశ్వనాధ రెడ్డి ఆధ్వరంలో కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ధనంజుయ రెడ్డి మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రికి ఇడుపులపాయలో ఇచ్చిన వినతి పత్రం సంబంధించిన అధికారులకు పంపడం అయిందని కొంత సమయం పట్టినప్పటికీ తప్పక రెగ్యులరైజ్ చేస్తామని ధనంజయ రెడ్డి చెప్పారు. ప్రతినిధి బృందంలో జిల్లా కన్వీనర్ ఖాదర్ బాషా జిల్లా నాయకులు వెంకటయ్య నాగయ్య రామయ్య గంగాధర్ ధర్మారెడ్డి తదితరులు ఉన్నారు.

ఎక్కువ మందిచదివినవి