Thursday 25th February 2021

ముఖ్యమంత్రికి ఔట్ సోర్సింగ్ జేఏసీ నివేదన 

 

 

 ఉద్యోగులు న్యూస్

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి  ఆధ్వర్యంలో ఔట్ సోర్సింగ్ జెఎసి ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి సమస్యలు నివేదించింది. ఈ సందర్బంగా జేఏసీ క్యాలెండర్ ను  ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివిధ సమస్యల పై వినతిపత్రాలు అందజేసి  పరిష్కరించాలని కోరింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అందరికి అమ్మఒడి వర్తింపజేయాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అందరికి అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలని, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రస్తుత ధరల సూచిక మేరకు 1 సంవత్సరానికి ఇంక్రిమెంటు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మరణింస్తే వారి కుటుంబానికి కారుణ్య నియామకం ద్వారా  ఉద్యోగమివ్వాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అందరిని కార్పొరేషన్ పరిధిలో కి తీసుకొని కార్పొరేషన్ ద్వారా వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. మోడల్ స్కూల్లో  పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో 6 జీతాలు చెల్లించాలని, వారికి వేసవిలోనూ జీతాలు ఇవ్వాలని కోరింది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించిన వారిని తిరిగి విధులలోకి తీసుకోవాలని, మార్కెట్ కమిటీలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మార్కెట్ కమిటీల ద్వారా కాకుండా ప్రభుత్వం బడ్జెట్  కేటాయించి వేతనాలు ఇవ్వాలి అని. అన్ని శాఖలలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మెడికల్ లివ్ మంజూరు చేయాలని,అటవీశాఖ శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కార్పొరేషన్ పరిధిలో కి తీసుకోవాలని, గ్రంథాలయ శాఖలో తొలగించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధులలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరామని ఆయన  స్వందిస్తూ  ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారన్నారు  సమస్యలు పరిష్కరించే దిశగా చూడమని  తన  కార్యదర్శి ధనుంజయరెడ్డి ఆదేశించారని జేఏసీ తెలిపింది.