వీఆర్వోలను స్పెషల్ ఆర్ఐలుగా మార్చండి
* ఆర్థికమంత్రికి గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం వినతి
( ఉద్యోగులు న్యూస్ )
ఆర్థికమంత్రితో రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం భేటీ అయ్యింది.
విఆర్ఓలను స్పెషల్ ఆర్ఐగా మార్చమని కోరింది. సర్వీస్ ఇబ్బందులుండవని ప్రభుత్వంఫై ఆర్థిక భారం పడదని విన్నవించింది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, బేవరేజ్ మాజీ చైర్మన్ దేవిప్రసాదా రావులను హైదరాబాద్ కాంప్ ఆఫీసులో కలిసి గ్రామ రెవెన్యూ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలు సంఘ ప్రతినిధులు వివరించారు. రాష్ట్రంలో పని చేస్తున్న 5485 మంది గ్రామ రెవెన్యూ అధికారుల సమస్యలను వివరించారు.
కొత్త రెవెన్యూ చట్టం వచ్చి దాదాపుగా 5నెలలు గడుస్తున్నా విఆర్ఓల సమస్యలకు పరిష్కరం లేదని రెవెన్యూ చట్టం 10 /2020 ప్రకారం వీఆర్వోల పోస్టు రద్దు అయినందున అర్హులైన గ్రామ రెవెన్యూ అధికారులకు సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ ను కల్పించాలన్నారు.
ఎలాంటి హోదా లేకుండా అపరిష్కృతంగా ఉన్న సాదా బైనామలను గ్రామాల్లోకి తీసుకెళ్లి పరిష్కరించాలని కొంతమంది తహశీల్దార్లు వి ఆర్ వోలను ఇబంది పెడుతున్నారని సీఎస్ ఆదేశాలు మేరకు భూములకు సంబందించిన పనులు విఆర్ఓలు చేయవొద్దని చెపుతుండగా కలెక్టర్లు/తహశీల్దార్లు చేయమని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇప్పుడున్న సీనియర్ అసిస్టెంట్ ఖాళీలలో అర్హులైన గ్రామ రెవెన్యూ అధికారులను భర్తీ చేయాలని, వీఆర్వోల సీనియారిటీ కి ఎలాంటి ఆటంకం కలగకుండా వారి సీనియారిటీని యధావిధిగా కొనసాగించాలని కోరారు విధి నిర్వహణలో ఉండి మరణించిన విఆర్వోలు కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం కల్పించాలని, 12 ఏళ్ల సర్వీస్ ఉన్న విఆర్వో లకు 12 సంవత్సరాల ఇంక్రిమెంట్ ని ఇవ్వాలన్నారు. రెవెన్యూ శాఖలో ఖాళీగ ఉన్న పోస్టులను భర్తీ చేయాలని,సబార్డినేట్ సర్వీసు రూల్స్ 2004 ప్రకారము 8 గంటల డ్యూటీ మాత్రమే చేయించాలని,వీఆర్వోల సర్వీస్ బుక్కుల అప్డేట్ చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.
సస్పెన్షన్కు గురైన వీఆర్వోలను ఎలాంటి షరతులు లేకుండా ఉద్యోగంలో నియమించాలన్నారు.
వీఆర్వోలను ఇతర శాఖలకు డిప్యుటేషన్ పంపించినప్పుడు వారికి 24 గంటలు డ్యూటీ చేయమని కొంతమంది అధికారులు ఆదేశాలు జారీ చేశారని సబార్డినేట్ సర్వీసు రూల్స్ 2004 ప్రకారము ఎనిమిది గంటలే డ్యూటీ చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. విఆర్వోల పేరు రద్దు చేసినందున స్పెషల్ ఆర్ఐ, జూనియర్ అసిస్టెంటుగా (కామన్ సీనియారిటీ)తో హోదా ఇవ్వాలని కోరారు. జాబ్ చార్ట్ ఏర్పాటు చేయాలని కోరారు. వారు సానుకూలంగా స్పందించి రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వి ఆర్ ఓ ల సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి.. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలను పరిష్కరిస్తామని సానుకూలంగా స్పందించడం జరిగింది దాదాపు 30 ని.శాలు పాటు రెవెన్యూ ఉద్యోగుల సమస్యల మరియు రెవిన్యూ సంస్కరణల గురించి చర్చించారు.
ఈ సమావేశం లో రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ సతీష్, ప్రధాన కార్యదర్శి పల్లెపాటి నరేష్, సహా అధ్యక్షుడు కాందారి భిక్షపతి,ఉపాధ్యక్షులు మౌలానా ఆశన్న, రమేశ్వర్ రావు,రమేష్,ప్రచార కార్యదర్శి.రాజన్న లు పాల్గొన్నారు.