రెండేళ్లు పూర్తయిన సచివాలయ ఉద్యోగులను సీఎం పర్మినెంట్ చేస్తామన్నారు
 

-వెంకట్రామిరెడ్డి వెల్లడి

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జులై 4-  ఆంధ్ర ప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అడ్ హాక్ కమిటీ ని  ఆదివారం ఎన్నుకున్నారు. సం ఘం గౌరవ అధ్యక్షులు కాకర్ల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ సంఘం ఎన్నికయింది. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ గ్రామ, సచివాలయ వ్యవస్థ ద్వారా మంచి సేవలు అందిస్తూ ముఖ్యమంత్రికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ ఉద్యోగులను రెండేళ్లు పూర్తయిన వెంటనే రెగ్యులర్ చేస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ భీమ్ రెడ్డి అంజన్ రెడ్డి  రాష్ట్ర కార్యదర్శి అంకమ్మరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.  నెల్లూరు జిల్లా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు . తదుపరి జిల్లా అధ్యక్షుడు సతీష్ రెడ్డి,  ప్రధాన కార్యదర్శి మహేంద్ర,  మహిళా అధ్యక్షురాలు  స్వర్ణ లత  మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తామని చెప్పారు. ఈ అసోసియేషన్ ను త్వరలోనే మండల స్థాయి వరకు విస్తరిస్తామని తెలిపారు.