ఆందోళన బాటలో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు
 

12న కలెక్టరేట్ల ముట్టడి, 15న  సమ్మె నోటీసు


 (ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జులై 5- సమస్యల పరిష్కారానికి పోరాట బాటలో సాగాలని వైద్య ఆరోగ్య శాఖలోని నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల రాష్ట్ర సదస్సు తీర్మానించింది. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో వీరంతా సమావేశమయ్యారు. అందరికీ వేతనాలు పెంచినా వైద్య ఆరోగ్య శాఖలోని నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు పెంచకపోవడం అన్యాయమని సదస్సు అభిప్రాయపడింది. ఈ నెల 12న 33 జిల్లా కలెక్టరేట్లను ముట్టడించాలని నిర్ణయించారు. జులై 15న వైద్య ఆరోగ్యశాఖ అధికారులందరికీ సమ్మె నోటీసులు ఇవ్వాలని సదస్సు నిర్ణయించింది. ఏఎన్ఎంలు, డాక్టర్లు, ఇతర పారామెడికల్ ఉద్యోగులందరూ రెగ్యులర్ ఎంప్లాయిస్ తో  సమానంగా పని చేస్తున్నా జీతాల్లో వ్యత్యాసం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.2017లో నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన పారా మెడికల్ ఉద్యోగులందరికీ వెంటనే అపాయింట్ మెంటు ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సదస్సులో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భూపాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. యాదానాయక్, రాష్ట్ర కోశాధికారి ఎండి. ఫసీయెద్దీన్, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు ఎ. కవిత, కె. బలరాం, వి. విజయవర్థన్ రాజు, బైరపాక శ్రీనివాస్, కె. సరోజ, విజయలక్ష్మి, నర్మద, శ్రీనివాసాచారి, సాదుల్లా, మోహన్ నాయక్, సావిత్రి, కిరణ్మయి, కుమార్, యమునారాణి తదితరులు పాల్గొన్నారు.