కాంట్రాక్టు ఉద్యోగుల ర్యాలీ, నిరసన
 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జులై 6-  తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఏపీ  డీఎస్సీ కాంట్రాక్టు పారామెడికల్  ఉద్యోగుల జెఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప జిల్లా యండపల్లెలో ర్యాలీ , నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమను రెగ్యులర్ చేయాలని, జీవో 299ను సవరించి కాంట్రాక్టు ఉద్యోగులకు, ఆశా వర్కర్లకు వర్తింపజేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ర్ట కన్వీనర్ యర్రపురెడ్డి విశ్వనాథ రెడ్డి  , జెఏసి జిల్లా కన్వీనర్ యస్. ఖాదర్ బాషా, జిల్లా నాయకులు జి.రాజేంద్ర,వి.నాగరత్నమ్మ, ఏపీ  ఎన్జీవో సంఘం మహిళా కార్యదర్శి యం.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.