గెస్టు లెక్చరర్లను యథాతథంగా కొనసాగించాలి
 

ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సంఘం నేతల వినతిపత్రం
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జులై 6-   తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 1,658 మంది గెస్ట్ లెక్చరర్లను యథాతథంగా కొనసాగించాలని ఆ సంఘం నాయకులు కోరారు.  పెండింగ్ వేతనాలను సత్వరమే మంజూరయ్యేలా చూడాలని విన్నవించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ను గెస్టు లెక్చరర్ల సంఘం రాష్ర్ట నాయకులు మంగళవారం కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ర్ట  ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్  వారి సమస్యలను ప్రత్యేక కార్యదర్శికి వివరించారు. కరోనా రెండో వేవ్ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించడంతో తమ గెస్టు  లెక్చరర్లను మినహాయించి ఇతర లెక్చరర్లను (రెగ్యులర్, కాంట్రాక్టు, ఎంటీఎస్, పార్టీ టైం హవర్లీ) కళాశాలకు హాజరు కావాలని ఇంటర్మీడియట్ కమీషనర్  ఆదేశించారని పేర్కొన్నారు.  విద్యార్థులకు న్యాయం జరగాలంటే ఎప్పటి నుంచో ఉన్న గెస్టు లెక్చరర్లను కొనసాగించాలని విన్నవించారు.