గూడూరు రెవెన్యూ డివిజన్ అధికారి ని కలిసిన విఆర్ఓ సంఘ నాయకులు.

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
 

శ్రీ పొట్టి శ్రీరాములునెల్లూరు జిల్లా గూడూరు రెవెన్యూ డివిజన్ అధికారిగా   శ్రీ వి మురళి కృష్ణ బాధ్యతలు స్వీకరించారు.  వారిని  డివిజన్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం డివిజన్ అధ్యక్షులు గిద్దలూరు రమణయ్య ,ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేంద్ర, కమిటీ మెంబర్లు  మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి  అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు.  రెవెన్యూ డివిజన్ అధికారి ని కలిసిన వారిలోపల్లి శ్రీనివాసులు, రాధాకృష్ణ, వెంకటేశ్వర రాజు, చంద్ర బాలాజీ, పుల్లయ్య ,వెంకట కృష్ణయ్య, తదితరులు ఉన్నారు    నాయకులతో గ్రామ రెవెన్యూ అధికారి ,వారి సమస్యలపైన అదేవిధంగా  ప్రమోషన్ లకు  అర్హత ఉన్న వారు ఎందరూ వున్నారో అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ అధికారులతో రెవెన్యూ డివిజన్ అధికారి చర్చించి  వారి ప్రమోషన్లపై సహకారం అందిస్తానని  రెవెన్యూ డివిజన్ లొ బాధ్యత యుతంగా పనిచేసి గూడూరు రెవెన్యూ డివిజన్ కు మంచి పేరు తీసుకురావాలని రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం మీరు అందరూ గట్టిగా పని చేయాలని కోరారు . గ్రామ రెవెన్యూ అధికారులు   శక్తివంచన లేకుండా పని చేసి  రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని    డివిజనల్ అధికారికిపేరు తీసుకొస్తామని   హామీ ఇచ్చారు.