గ్రంథాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీ చేయాలి
 

ఉద్యోగుల సంఘం డిమాండ్
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జులై 19- ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం గ్రంథాలయ సంస్థల ఛైర్మన్ల పోస్టులను భర్తీ చేయడం హర్షణీయమని పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం (రి.నెం 31/17 ) రాష్ట్ర అధ్యక్షులు జి.రాంబాబు, ప్రధాన కార్యదర్శి నాదెండ్ల బాబ్జీ సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా గ్రంథాలయాల్లో ఉన్న పోస్టుల భర్తీకి కొత్త ఛైర్మన్లు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ర్ట గ్రంథాలయ సంస్థ కొత్త ఛైర్మన్ మందపాటి శేషగిరిరావును అభినందించారు.  అన్ని గ్రంథాలయాలకు  దిక్సూచి అయిన రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం  ఏర్పాటుకు కృషి చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.  విభజన జరిగి చాలా సంవత్సరాలు అయినా ఇప్పటికీ రాష్ర్ట  కేంద్ర గ్రంథాలయం ఏర్పాటు చేయలేదనే విషయాన్ని పరిషత్ చైర్మన్  దృష్టికి తీసుకువెళ్తున్నామని అన్నారు.