ఆగస్టు లో ఏపీటీఎఫ్ మధ్యంతర కౌన్సిల్
 

-శ్రీకాకుళం జిల్లాశాఖ నిర్ణయం

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జులై 19- ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపు మేరకు ఈ నెల 23న అన్ని తాలూకా కేంద్రాల్లో ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించాలని ఏపీటీఎఫ్ (1938) నాయకలు పిలుపునిచ్చారు. సంఘం శ్రీకాకుళం జిల్లాశాఖ నిర్వహించిన జూమ్ యాప్ సమావేశంలో నాయకులు ఈ మేరకు విన్నవించారు. జిల్లా అధ్యక్షులు వాన కామేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఫెడరేషన్ జిల్లా గౌరవాధ్యక్షులు సన్నశెట్టి రాజశేఖర్ , ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చించాడ దిలీప్ కుమార్ లు మాట్లాడారు.  జిల్లా ప్రధాన కార్యదర్శి కె చలపతిరావు ప్రవేశపెట్టిన ఎజెండా సమావేశం చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించింది.
- రాజీనామా చేసిన నాయకులతో మాట్లాడాలని నిర్ణయించారు. సత్తారు పోలినాయుడు కొనసాగుతానని అన్నందున హర్షం వ్యక్తం చేసింది.
- ఏపీటీఎఫ్ మధ్యంతర జిల్లా కౌన్సిల్ సమావేశం  ఆగస్టు మొదటి వారంలో  నిర్వహించాలని నిర్ణయించారు.
- ఏపీటీఎఫ్ మండల శాఖలు జూలై ఆఖరులోగా మండల స్థాయి సర్వసభ్య సమావేశాల్ని  నిర్వహించాలి.