సీపీఎస్  ఉద్యోగుల సమస్యలపై ఖజానాశాఖ డైరక్టర్ తో భేటీ
 

- ఏపీ జేఏసీ నేత హృదయరాజు వెల్లడి


(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జులై 19- ఆంధ్రప్రదేశ్ లో సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై  ఏపీటీఎఫ్, ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ సమితి నాయకులు హృదయరాజు ఖజానాశాఖ  డైరక్టర్ మోహన్ రావును కలిసి చర్చించారు. ప్రధానంగా మూడు అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు తె లియజేశారు.  సమస్యల పరిష్కారానికి మోహన్ రావు సానుకూలంగా స్పందించారు. ఆయన దృష్టికి వెళ్లిన సమస్యలు ఇవీ...
- సీపీఎస్ ఉద్యోగుల పాక్షిక ఉపసంహరణలకు ఎలాంటి డాక్యుమెంట్లు కావాలని అడగకూడదు. ఉద్యోగుల స్వీయ ధ్రువీకరణతోనే అనుమతించాలి.
- 2004-2012 మధ్య  సీపీఎస్ ఉద్యోగులకు వచ్చిన కరవు భత్యం, పీఆర్సీ బకాయిలను  సీఎస్ఎస్ ఖాతాలకు మళ్లించారు. 2013లో ప్రభుత్వం ఇచ్చిన జీవో 22 ప్రకారం  అవి  8శాతం వడ్డీతో చెల్లించాలి
-  సీపీఎస్ ఉద్యోగులకు మిస్సింగ్ క్రెడిట్ సమస్య పరిష్కారం కావడం లేదు. ఉద్యోగుల ఖాతాల నుంచి సొమ్ములు మినహాయిస్తున్నా వారి ప్రాన్ ఖాతాలకు జమ కావడం లేదు. తెలంగాణ తరహాలోనే ఇక్కడ కూడా ఆ సమస్యను పరిష్కరించాలి.