ఏపీ డ్రైవర్ల సంఘం రాష్ర్ట అధ్యక్షునిగా కొండయ్య
 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జులై 19- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ర్ట అధ్యక్షునిగా డి.ఎస్.కొండయ్య ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షులు శ్రీరాములు పదవీ విరమణ చేయడంతో ఈ  ఎన్నిక అనివార్యమయింది. ప్రస్తుతం అసోసియేట్ అధ్యక్షునిగా ఉన్న కొండయ్యను కొత్త అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ఏపీ అమరావతి జేఏసీ అసోసియేషన్ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు  హాజరై మాట్లాడుతూ సంఘానికి ఏ అవసరం వచ్చినా తాము అండగా ఉంటామన్నారు. గత 10 ఏళ్లుగా కొన్ని అసాంఘిక చర్యల వల్ల సంఘం నష్టపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అమరావతి జేఏసీ సెక్రటరీ జనరల్ వై వి రావు, సిటీ ఛైర్మన్ డి.ఈశ్వర్ ఇతర నాయకులు కిషోర్, గోపీ- తెలంగాణ రాష్ర్ట డ్రైవర్ల సంఘం నాయకులు జహంగీర్, హరినాథ్ బాబు, హబీబ్ ఖాన్ తదితరులు హాజరయ్యారు.