ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో వైఫల్యం
 

- తెలంగాణా రాష్ట్ర ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంఘం
- ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అరెస్టు అన్యాయం


(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జులై 19-  ఉద్యమాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ర్టంలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో  ప్రభుత్వం విఫలమైందని తెలంగాణా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంఘం  రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అడ్ల గట్ట గంగాధర్  ఒక ప్రకటనలో విమర్శించారు.  ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడేందుకు సీఎం కేసీఆర్ అనుమతి ఇవ్వాలని వారు కోరారు.  ఉపాధ్యాయల బాధలను రాష్ట్ర ముఖ్య మంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పాదయాత్ర చేస్తే  ఆయనను అరెస్టు చేయడాన్ని సంఘం ఖండిస్తోందన్నారు.  ఉపాధ్యాయుల పక్షాన రాష్ట్ర ముఖ్య మంత్రికి మెమొరాండం ఇచ్చేందుకు ప్రగతి భవన్  వెళ్తే సమస్యలు నివేదించే అవకాశం ఇవ్వకుండా అరెస్టు చేయడం తగదన్నారు.