23న ఫాప్టో ధర్నా
 

ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గోవాలి
అప్తా నాయకుల పిలుపు


మద్దతు ప్రకటించిన కంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగుల సంఘం
సీపీఎస్ విధానాన్ని తక్షణమే రద్దుచేయాలని, ప్రైవేట్ పాఠశాలలను ప్రోత్సహించేలా ఉన్న నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాద్యాయ సంఘం(అప్తా) రాష్ట్ర అధ్యక్షుడు ఎ.జి.ఎస్ .గణపతి రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రకాశరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఈమేరకు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫాప్టో) ఆధ్వర్యంలో ఈనెల 23న  పాత తాలూకా కేంద్రాల్లో నిర్వహించే ధర్నాలో అన్ని సంఘాల ఉపాధ్యాయులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.  రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులకు ఇవ్వాల్సిన 11వ పి.ఆర్.సి. ని వెంటనే ప్రకటించాలని , ఇప్పటివరకు పెండింగులో ఉన్న డి ఏ లను వెంటనే విడుదల చేస్తూ జీవోలు జారీ చేయాలని కోరారు.  సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  పాదయాత్రలో హామీ ఇచ్చారని ,  అందువల్ల తక్షణమే రద్దుచేయాలని అప్తా సంఘం నాయకులు కోరారు.  
ఫాప్టో ధర్నాకు కంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగుల సంఘం (ఏపీసీపీఎస్ యూఎస్) సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు  ఆ సంఘం రాష్ర్ట ప్రెసిడెంట్ సి.ఎం.దాస్,  ప్రధాన కార్యదర్శి  ఎం.రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.  23న తలపెట్టని ధర్నా కార్యక్రమాల్లో సీపీఎస్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.