గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు
త్వరలో పరీక్షలు


-  ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో  నిర్వహణ
- త్వరలో తేదీలు ఖరారు

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జులై 20-  ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించి రెండు  సంవత్సరాలవుతోంది. ఆ ఉద్యోగ సంఘాలన్నీ తమ  ప్రొబెషనరీ ఖరారు చేసి తమను రెగ్యులర్ చేయాలని కోరుతున్నాయి.  ఈ ఏడాది అక్టోబరు 2 నాటికి వారు ఉద్యోగాల్లో చేరి రెండేళ్లవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారికి డిపార్టుమెంటల్ పరీక్షలు నిర్వహించి అందులో   ఉత్తీర్ణులైన వారిని మాత్రమే ప్రొబెషనరీ ఖరారు చేసి రెగ్యులర్ స్కేలు ప్రకారం వేతనాలు చెల్లిస్తారు. ఇందుకోసం  ప్రభుత్వం సిలబస్ ఖరారు చేసింది. ప్రస్తుతం సోమవారం నుంచి వారికి శిక్షణ ప్రారంభమయింది. త్వరలో పరీక్షల తేదీలు ఖరారు చేస్తారు.  ఆ పరీక్షల్లో  నిర్ణీత మార్కులతో ఉత్తీర్ణులయిన వారికి ప్రొబెషనరీ ఖరారు చేస్తారు.  ఒక వేళ పరీక్షలో ఉత్తీర్ఱులు కాకుంటే మళ్లీ శిక్షణ నిర్వహిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత పరీక్షల తేదీలు వెల్లడించనున్నట్లు  గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అధికారులు పేర్కొంటున్నారు.