ప్రాన్ ఖాతాలకు సొమ్ములు జమ కావడం లేదు
 

- పరిష్కరించాలంటూ ఎస్ టీ యూ వినతి
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జులై 20-  రాష్ర్టంలో సీపీఎస్ ఉద్యోగుల మిస్సింగ క్రెడిట్ సమస్యలను పరిష్కరించాలని  ఏపీ రాష్ర్టోపాధ్యాయ సంఘం నాయకులు జోసెఫ్ సుధీర్ బాబు, ఎం.రఘునాథరెడ్డిలు  కోరారు. ఈ మేరకు ఖజానాశాఖ డైరక్టర్ కు వారు వినతి పత్రం సమర్పించారు. రాష్ర్టంలో 1.90 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు  ఉండగా వారి వేతనాల నుంచి మినహాయించిన సొమ్ములు వారి ప్రాన్ ఖాతాకు జమ కావడం లేదన్నారు. ఉద్యోగి ప్రాన్ ఖాతా వేరే ఉద్యోగి ఐడీకి అనుసంధానమై ఉండటంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.