ఆరోగ్యశాఖలో  36  యాప్ లను 6 యాప్ లకు కుదిస్తాం
 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జులై 21- వైద్య ఆరోగ్యశాఖలో ఏ ఎన్ ఎం లు కిందిస్థాయి సిబ్బంది యాప్ ల విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ హామీ ఇచ్చారు. ఎన్ జీ వో సంఘం నేతలు బండి శ్రీనివాసరావు, కె.శివారెడ్డి, కృపావరం తదితరులు బుధవారం ఆయనను కలవగా ఈ మేరకు హామీ ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖలో జాయింట్ కలెక్టర్ల పెత్తనాన్ని నిరసిస్తూ జి.ఓ. నెంబర్ 64ను నిలుపుదల చేసేందుకు హామీ ఇచ్చినా  ఇంకా చర్యలు తీసుకోలేదని ఎన్ జీ వో నేతలు సీఎస్ వద్ద  ప్రస్తావించారు. ఎ.పి. ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధానకార్యదర్శుల సమక్షంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి వెంటనే ఉత్తర్వులు జారీకి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.