ఫ్యాప్టో ధర్నాకు ఏపీ జేఏసీ మద్దతు


 రాష్ట్రంలో ముప్పై ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న పిఆర్సీ అమలు 6 డిఎల మంజూరు సి పి ఎస్ రద్దు కోరుతూ ఈ నెల 23న ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాకు ఏపీ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు సెక్రటరీ జనరల్ జి హృదయ రాజులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని తాలూకా కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య చేపట్టిన ఈ దశలవారీ ఆందోళన కార్యక్రమానికి జేఏసీ లోని అన్ని సంఘాలు మద్దతు ఇవ్వాలని శ్రీనివాస రావు హృదయ రాజులు కోరారు. పదవీ విరమణ చెందిన ఉద్యోగుల గ్రాట్యుటీ  పింఛన్ జిపిఎఫ్  తదితర బకాయిలను ప్రభుత్వం సకాలంలో చెల్లించాలని అలాగే జాతీయ నూతన విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడంపై స్పష్టతనివ్వాలని వారు కోరారు .ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు డిమాండ్ల పరిష్కారానికి సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవ చూపాలని వారు కోరారు.