Thursday 29th July 2021

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నేరుగా ప్రొబేషన్ ఇవ్వండి

* సీబీఏఎస్ విధానంతో ముడిపెట్టొద్దు

* ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ కు వినతి

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్) జులై 22:

సీబీఏఎస్ విధానానికి, ప్రొబేషన్ ఎంపికకు ముడి పెట్టవద్దని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్, ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్ ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ను బుధవారం కలిసి వినతి పత్రం సమర్పించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రధాన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. సీబీఏఎస్ విధానాన్ని పునహ్ పరిశీలించాలని, అక్టోబర్ 2 నాటికి రెండేళ్లు పూర్తి చేసుకోబోయే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎటువంటి  నిబంధనలు లేకుండా పే స్కేల్ వర్తింపచేయాలని కోరారు. బయోమెట్రిక్ సిస్టంలో లోపాలు సరి చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.