ఒకే పరీక్ష నిర్వహించండి


*వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో సీఎస్ ను కలిసి విజ్ఞప్తి చేసిన గ్రామ సచివాలయ ఉద్యోగులు

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

జులై 23:  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ పరీక్షలపై ప్రభుత్వం చేసిన ప్రకటనతో కొందరు గందరగోళానికి గురి అవుతున్న నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ ను కలిశారు.  రెండు రకాల పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించగా ఒక పరీక్ష మాత్రమే నిర్వహించాలని విజ్ఞప్తి చేశామని వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.  ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్ష నుంచి మినహాయించాలని కోరినట్లు వెల్లడించారు.  పరీక్షా విధానాన్ని సరళతరం చేశామని, ప్రస్తుత పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయినా రెండోమారు రాసే పరీక్ష వల్ల సీనియారిటికీ ఇబ్బంది రాదని  సీఎస్ చెప్పారని తెలిపారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రొబేషన్ పూర్తి కావడానికి డిపార్ట్మెంట్ పరీక్షలు రాయాల్సి ఉంటుందన్నారు.