అన్ని సంఘాలూ ఏకమై పోరాడదాం

* సీబీఏఎస్ పరీక్షలను ప్రొబేషన్ కు ముడిపెట్టొద్దు

* గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

జులై 24: షరతులు లేని క్రమబద్ధీకరణకు రాష్ట్రంలోని గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘాలన్నీ ఐక్యంగా పోరాడి సమస్యను పరిష్కరించుకుందామని అని గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్  పిలుపునిచ్ఛారు. కోవిడ్ ఆస్పత్రుల్లో కరోనా బాధితుల మధ్య, స్మశానవాటికల్లో కూడా గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు విధులకు హాజరు అయ్యారని గుర్తు చేశారు. అదేవిధంగా ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించడంలో ఈ వ్యవస్థలోని ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని, రూ.15000 వేతనం చాలక ఇబ్బందులు పడుతూనే తమ సర్వీసును రెగ్యులర్ ఒకే ఒక ఆశతో పని చేస్తున్నారని తెలిపారు. 
అయితే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు అందరు క్రెడిట్ బేస్ అసెస్మెంట్ సిస్టమ్ ( CBAS ) పరీక్షలో ఉత్తీర్ణులైతేనే ప్రొబేషన్ ప్రకటిస్తామని చెప్పడంతో అందరూ ఆందోళన చెందుతున్నారన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సచివాలయ ఉద్యోగులు చేసిన సేవలను గుర్తించి సీబీఏఎస్ పరీక్షల తో సంబంధం లేకుండా ఎటువంటి ఇతర షరతులు లేకుండా వచ్చే అక్టోబర్ 2 నాటికి రెండు సంవత్సరాలు ప్రొబేషన్ పూర్తి చేసుకోబోయే గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేయాలని చేయాలని విజ్ఞప్తి చేశారు.  ఈ మేరకు రాష్ట్రంలోని గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు అందరూ అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేయాలని కోరారు.త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్. సూర్యనారాయణ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి తమ డిమాండ్లపై వినతిపత్రం అందజేస్తామని వెల్లడించారు.  రాష్ట్రంలోని గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు అందరు సీబీఏఎస్పై శిక్షణకు సిద్ధంగా ఉన్నారని, కానీ ప్రొబేషన్ కు ఈ పరీక్షలకు ముడిపెట్టొద్దని కోరారు.