పీఆర్టీయూ సభ్యత్వ వారోత్సవాలు 

 

ఆగస్టు 18: పీఆర్టీయూ సభ్యత్వ వారోత్సవాలలో భాగంగా బుధవారం బాలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , మామిడి పల్లి పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ యాదవ్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మధుకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి గౌరవ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవర్ధన్ యాదవ్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పీఆర్టీయూ ఎల్లప్పుడు పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.  

సీపీఎస్ రద్దు, అదనపు ఇంక్రిమెంట్లు, నగదు రహిత ఆరోగ్యపథకం, మొత్తం సర్వీసు కాలంలో ఎప్పుడైనా వాడుకొనే విధంగా పిల్లలసంరక్షణ సెలవుల్లో మార్పులు, ఏకీకృత సర్వీసు నిబంధనలు, పండితులు, పీఈటీలకు పదోన్నతులు తదితర సమస్యలు, డిమాండ్ల సాధనకు పీఆర్టీయూలో సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు. అక్టోబరులో జరిగే పీఆర్టీయూ స్వర్ణోత్సవాలకు ఆర్థిక సహాయం చేసి సమస్యల సాధనకు చేయూతనివ్వాలని ఉపాధ్యాయులను కోరారు. కార్యక్రమంలో శ్రీనివాస్ ,హరికృష్ణ ,బుచ్చయ్య ,లింగమ్ , రహీం పాషా తదితరులు పాల్గొన్నారు.

 

ఎక్కువ మందిచదివినవి