గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల  పర్మినెంట్ కు ముఖ్యమంత్రి అంగీకారం


- 8 విభాగాల ఉద్యోగులకు డిపార్టుమెంటు పరీక్షలు ఉండవు
- 50శాతం మంది ఇప్పటికే పరీక్షలు పాస్
- వారందరూ రెగ్యలర్ అవుతారు
- గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
ఆగస్టు 22- గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు అక్టోబరు 2 నుంచి ప్రొబేషనరీ ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు అని గవర్నమెంటు ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి చెప్పారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎదుర్కొంటోన్న సమస్యలను గతంలో సీఎం దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. అక్టోబర్ నుంచి ప్రొబెషన్ డిక్లేర్ చేయాలని సీఎం ను కోరగా ఆయన అంగీకరించారని చెప్పారు. విజయవాడలో ఆదివారం మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడారు. ఆయన చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి...
- ఇప్పటికే సచివాలయ సిబ్బందికి 010 కింద ప్రభుత్వం వేతనాలు ఇస్తోంది.
- 1.34 లక్షల మంది సచివాలయ ఉద్యోగులను నిబంధనల ప్రకారం వారి సర్వీసులను ప్రభుత్వం రెగ్యులర్ చేస్తుంది.
- నెగిటివ్ మార్కులు తొలగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
- గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇప్పటివరకు 50శాతం మంది డిపార్టు మెంట్ టెస్టు పాసయ్యారు. వారందరి సర్వీసులు రెగ్యులర్ అవుతాయి.
- 8 కేటగిరి ఉద్యోగులకు డిపార్టు మెంట్ పరీక్షలు ఉండవు
- వారందరినీ నేరుగా సర్వీసులు రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం 
- వారిందరికీ పదోన్నతి సమయంలో పరీక్ష పెట్టాలని కోరుతున్నాం. 
- మహిళలకు మెటర్నిటీ లీవ్ ను డ్యూటీ పీరియడ్ గా గుర్తించి వారందపరినీ పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం 
- కొత్త వ్యవస్థ వచ్చినపుడు కొన్ని సమస్యలు వస్తుంటాయి. వాటన్నంటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం 
- సచివాలయ సిబ్బంది కోసం సెప్టెంబర్ లో మరో డిపార్టు మెంట్ పరీక్షను పెట్టాలని ఎపీపీఎస్సీ ని కోరుతున్నాం 
- వీలైనంత ఎక్కువ మంది సిబ్బంది డిపార్టుమెంట్ పరీక్ష పాసయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం
- అక్టోబర్2 న వీలైనంత ఎక్కు మంది సిబ్బంది ఉద్యోగాలు పర్మినెంట్ అవుతారు

ఎక్కువ మందిచదివినవి