మహిళా పోలీసులకు ఆప్షన్ ఇవ్వాలని కోరుతున్నాం

- ఇష్టమైన వారే అటు వెళ్లవచ్చు
-  ఎంప్లాయిస్ ఫెడరేషన్  నేత కాకర్ల వెంకట్రామిరెడ్ది

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
ఆగస్టు 22- గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి మహిళా పోలీసులకు ఆప్షన్ ఇచ్చేలా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని గవర్నమెంటు ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఆయన విజయవాడలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు.  ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పనిచేయాలని పిలుపునిచ్చారు.   మహిళా సంరక్షణ కార్యదర్శులను  పోలీసు విభాగంలో కలపడాన్ని కొందరు సిబ్బంది వ్యతిరేకిస్తున్నారని, కొందరు సమర్థిస్తున్నారని అన్నారు.  ఇష్టం ఉన్నవారే పోలీసు విభాగంలోకి వెళ్లవచ్చని వెంకట్రామిరెడ్డి చెప్పారు. లేని వారు వేరే ఆప్షన్  ఎంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. త్వరలోనే ఆ అవకాశం వస్తుందన్నారు.