వ్యవసాయ అసిస్టెంటు కుటుంబానికి
గ్రామ, వార్డు సచివాలయ 
ఎంప్లాయిస్ అసోసియేషన్ సాయం


(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
ఆగస్టు 23
-  శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మడమనూరు సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ పెనుగొండ గంగన్న  సోమవారం మరణించారు. ఈ విషయాన్ని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్  నెల్లూరు జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి  , జనరల్ సెక్రటరీ కె మహేంద్ర రెడ్డి ఈ విషయాన్ని రాష్ర్ట సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లి హరీష్ ,  రాష్ట్ర జాయింట్ సెక్రటరీ  వెంకటేశ్వర్లు స్పందించి తక్షణమే బాధిత కుటుంబానికి రూ.10 వేల  ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు. తక్షణమే ఆ కుటుంబానికి సాయం అందించారు. వ్యవసాయ శాఖ జిల్లా డైరెక్టర్ , అడిషనల్ డైరెక్టర్ తో  మాట్లాడి వారి కుటుంబానికి ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన అన్ని  ప్రయోజనాలు అందించాలని కోరినట్లు వారు సంఘం జిల్లా నాయకులు తెలిపారు. ఇందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేశారు.