సెప్టెంబరు లో డిపార్టుమెంట్ పరీక్ష నిర్వహించాలి
 

- ఎండీ జానీ బాషా విన్నపం
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
ఆగస్టు 28- గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం సెప్టెంబరు నెలలో డిపార్టుమెంట్ పరీక్ష నిర్వహించాలని ఆ ఉద్యోగుల ఫెడరేషన్ (నెం138/2020) రాష్ర్ట అధ్యక్షులు ఎం.డి.జానీ బాషా విన్నవించారు. ఏపీపీఎస్సీ సభ్యులు సలాంబాబు ను కలిసి ఈ మేరకు డిమాండ్ చేశారు. ఈ పరీక్ష వల్ల డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అవ్వని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎంతో మేలుజరుగుతుందని ఆయన విన్నవించారు.