పీఆర్టీయూ పెడన మండల శాఖ అధ్యక్షుడిగా పాష  
 

•    ప్రధాన కార్యదర్శిగా ఈశ్వరరావు 
 (ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
ఆగస్టు 31:  పీఆర్టీయూ  (రిజిస్టర్ నెంబర్  102/18)  పెడన మండల శాఖ అధ్యక్షుడిగా జే ఎం ఆర్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలనలో పనిచేస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయుడు  ఎండి పాషా,   ప్రధాన కార్యదర్శిగా నందిగామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న  కోసూరు ఈశ్వరరావును  నియమిస్తున్నట్లు  పీఆర్టీయూ కృష్ణా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు  గంటా రంగారావు, కొనకళ్ల రమేష్ బాబు లు  ఒక ప్రకటనలో తెలియజేశారు.  పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  పెద్ది బోయిన శ్రీనివాసరావు   అధ్యక్షతన జరిగిన  మండల కార్యవర్గ సమావేశంలో  ఏకగ్రీవంగా ఈ ఎన్నిక  జరిగింది.  ఈ సందర్భంగా కొనకళ్ల రమేష్ బాబు మాట్లాడుతూ  త్వరలో అన్ని మండల శాఖలను పునర్వ్యవస్థీకరస్తామని  తెలిపారు.  గంటా రంగారావు మాట్లాడుతూ  ఈ ప్రాంతంలోని ఉపాధ్యాయుల సమస్యల పట్ల  చిత్తశుద్ధితో పనిచేసి  సంఘానికి మంచి పేరు తీసుకురావాలని  నూతన కమిటీకి సూచించారు.  పెద్దిబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ  త్వరలోనే మచిలీపట్నం డివిజన్ మొత్తం పర్యటించి  పీఆర్టీయూను బలోపేతం చేస్తామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో  పీఆర్టీయూ స్టేట్ అకడమిక్ సెల్  రాష్ట్ర కన్వీనర్  కోసూరి రాజశేఖర్,  రాష్ట్ర కార్యదర్శి  వక్కలగడ్డ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్,  మండల కార్యవర్గ సభ్యులు ఉపాధ్యాయులు  తదితరులు పాల్గొన్నారు.