నినదించిన సీపీఎస్ ఉద్యోగలోకం


- ప్రతి జిల్లాలోనూ నిరసన ర్యాలీలు
- జిల్లా కేంద్రాల్లో  సభలు
- ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరు
- జోరు వర్షంలోను ర్యాలీలు..
- కొన్ని చోట్ల పోలీసుల అడ్డగింత

(ఉద్యోగులు.న్యూస్) ( ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 1- ఆంధ్రప్రదేశ్ అంతటా సీపీఎస్ రద్దు నినాదం  హోరు ఎత్తుతోంది. ఉపాధ్యా, ఉద్యోగ లోకం సీపీఎస్ రద్దు చేయాలంటూ ఉద్యమించింది. ఆ జిల్లా, ఈ జిల్లా అని లేదు, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు అన్ని చోట్లా వేలమంది  ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరాటం సాగిస్తున్నారు. పెన్షన్ వ్యతిరేక దినం నిర్వహిస్తూ సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతున్నారు. సీపీఎస్ కు వ్యతిరేకంగా ఏర్పడ్డ రెండు సంఘాలు, అనేక ఉపాధ్యాయ సంఘాలు ఈ ఆందోళనల్ల పాలు పంచుకుంటున్నాయి. అన్ని ఇతర  ఉద్యోగ సంఘాలు మద్దతు పలుకుతున్నాయి.
గుంటూరులో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద  ఎత్తున  ర్యాలీ నిర్వహించారు. వర్షంలోనూ వారు ర్యాలీ కొనసాగించారు.  మూడు బొమ్మల సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ఉపాధ్యాయ ఉద్యోగులు ప్రదర్శనగా బయలు దేరారు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని నినాదాలు చేశారు. కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ కు వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో జిల్లా కోర్టు మీదుగా ర్యాలీ కొనసాగింది. అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సీపీఎస్  రద్దుపై మచిలీపట్నం కలెక్టరేట్ ధర్నా చౌక్ లో ఉద్యోగ సంఘాల ఆందోళన నిర్వహించాయి. ఒంగోలు జిల్లా కేంద్రంలో రెండు శిబిరాలుగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. విజయనగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మరో వైపు అనంతపురం, కడప, కర్నూలు, విశాఖపట్టణం, శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు లలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో సీపీఎస్ రద్దు చేయాలంటూ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.