సీపీఎస్ రద్దుపై ముఖ్యమంత్రి    ఎక్కడా మాట్లాడరేం?


- మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 1- అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన జగన్ ముఖ్యమంత్రిగా ఆ విషయంపై మాట్లాడరేం అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. సీపీఎస్ ను రద్దు చేయాలని కోరుతూ మచిలీపట్నంలో ఉద్యోగుల నిరసన సభకు బుధవారం ఆయన మద్దతు పలికి  అక్కడ మాట్లాడారు. ఉద్యోగుల ఆందోళనకి సంఘీభావం ప్రకటించారు. ఉద్యోగులు సీపీఎస్ కోసం జరిపే పోరాటంలో టీడీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 27 నెలలు అయినా ఇంకా తన హామీ నెరవేర్చలేదన్నారు. సిపిఎస్ రద్దుపై ముఖ్యమంత్రి ఎక్కడా మాట్లాడటం లేదని విమర్శించారు.  ప్రభుత్వం పీఆర్సీ కూడా అమలు చేయలేదన్నారు.  ముఖ్యమంత్రికి చిత్తశుద్ది ఉంటే సీపీఎస్ పై హామీ నిలబెట్టుకోవాలన్నారు.